అందాల రాక్షసి

  • 9.6k
  • 1
  • 3.3k

సమయం ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు...నేను నిద్ర మేల్కొని, బెడ్ దిగి, బాల్కనీ వైపు నడిచాను...శీతాకాలం కావడంతో వణుకు పుట్టిస్తుంది వాతావరణం... చేతులు కట్టుకొని చుట్టూ చూస్తూ వున్నాను... అంతలో రూంలో అలారం క్లాక్ మోగుతుంది.. నా పెదవుల మీద సన్నని చిరునవ్వు... ఇది రోజూ జరిగేదే... నాలుగు గంటలకు అలారం మోగడానికి కొన్ని నిమిషాల ముందే నేను మేల్కొంటాను... ప్రతీ రోజూ నేను నా క్లాక్ ని ఓడిస్తాను... ఎందుకో ఇందులో నాకు ఆనందం వుంది... కాలం నా చేతిలో ఓడిపోతుంది అనిపిస్తుంది... ఇలా గెలుపుతో నా రోజు మొదలవుతుంది...అలారం క్లాక్ గొంతు నొక్కి, యోగా చేస్తాను వన్ అవర్ పాటు... తరువాత నా పర్సనల్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని సరిగ్గా సెవెన్ కల్లా నేను నా రూంలో నుంచి బయటకు వస్తాను...నేను బయటకు రావడంతోనే సర్వెంట్స్ అందరూ ఎలర్ట్ అవుతారు... అందరూ భయపడతారు నాకు...