తనువున ప్రాణమై.... - 1

  • 10.7k
  • 1
  • 5.1k

హాయ్ ఫ్రెండ్స్!ప్రోమో అంటూ.. మీ టైం అసలు వేస్ట్ చేయకుండా,ఒక చిన్నమాట!!లవ్ ఎట్ ఫస్ట్ సైట్.చాలా చోట్ల వినే ఉంటాం.అటువంటి ఒక సందర్భంలో కలిసిన, ఇద్దరి మధ్య ప్రయాణం ఎలా ముగుస్తుందో, తెలియజేయడమే ఈ కథ.దీనిలో... అలా కలిసిన, ఆ ఇద్దరి మధ్య ఎక్కువ కథ నడుస్తుంది.మిగిలిన పాత్రలు, సందర్భానుసారంగా వచ్చిపోతూ ఉంటాయి.ఒక అమ్మాయి ఇలా ఉంటే, ఎలా ఉంటుంది? అన్న చిన్న ఆలోచనకి, నా కథలోని కథానాయిక కి రూపాన్ని ఇస్తున్నాను.ప్రేమ,అల్లరి, హాస్యం, ఫ్రస్టేషన్, సస్పెన్స్... మద్య సాగే వాళ్ల ప్రయాణం! ప్రాణం కన్నా ఎక్కువైనా, ప్రేమతో ముడి పడుతుందా?తనువున ప్రాణం ఏ చోట ఉన్నది అంటే? అది మన గుండెల్లో ఉన్నది అంటాము. మరి ప్రేమ ఎక్కడ పుడుతుంది? అది కూడా మన గుండెల్లోనే! మరి మన మనసు ఎక్కడ ఉంది? అది కూడా మన గుండెల్లోనేనా...తనువున ఉన్న మనసులో జనించిన ఆ ప్రేమ, ఆ గుండెల్లోనే కొలువుంటుంది