నీడ నిజం - 38

  • 4.3k
  • 1.4k

తను అజయ్ వస్తాడని ఎదురు చూస్తున్నాడు . వచ్చింది అతడి భార్య రూపాదేవి ! కారణం ఏమిటో సాగర్ కు అర్థం కాలేదు . “ నమస్తే ! నేను రూపాదేవి---అజయ్ సింహ్ భార్యను . “ . స్వచ్చమైన ఆంగ్లం . అంతకన్నా స్వచ్చమైన చిరునవ్వు . రూపాదేవి చేతులు జోడించింది . ఆమె లో రూపం, స్వరం, వినయం, వందనం పోటీ పడుతున్నాయి . సాగర్ మర్యాదగా కూర్చోమన్నాడు . కూర్చుంది . “ విద్యాధర బాగున్నారా ? ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా ?” ఆమె ప్రశ్న కు సాగర్ సమాధానం చెప్పాడు . “ మీరు మా గ్రామం వచ్చినప్పుడు మేము లేము . పిల్లల్ని చూడటానికి జైపూర్ వెళ్లాం “ “ ఇట్సాల్ రైట్ .” అర నిమిషం నిశ్శబ్దం . సంభాషణ ఎలా పొడిగించాలో ఎవరకీ అర్థం కాలేదు . “