ఓం శరవణ భవ - 11

  • 5.3k
  • 2k

సుందరవల్లి తన సోదరిలా కాక  మనసు కుదిరినప్పుడు తపోధ్యానములో కూర్చునేది .  లోక కల్యాణ కారకుడైన  నారదమహర్షి తరుణం చూసి  శివ తనయుని  స్కందగిరి లో దర్శించాడు .  నారాయణ పుత్రికల మనో వాంఛితమును  షణ్ముఖునికి వివరిస్తాడు .  యుక్తవయస్కుడైన కార్తికేయుడు  విష్ణుకన్యల  రూపురేఖలను, మనసును నారదుని కథనం  ద్వారా  గ్రహించి వారిని అనుగ్రహించాలని సంకల్పిస్తాడు .  పై ఉదంతం శివకేశవుల అభేదాన్ని  ఆవిష్కరిస్తుంది .  శివశక్తి విష్ణుశక్తి వైపు మొగ్గు చూపటం చాల సహజమైన పరిణామం. ‘ జగతి లో ఏ మహత్కార్యానికైనా  శివకేశవులు ఏకం కానిదే  పరిపూర్ణ సిద్ధి లభించదు’ పైగా  జ్ఞానశక్తికి  ఇచ్ఛా క్రియా శక్తులు  సోపానములై ,  సాధనా విశేషములై  అలరారుట  ఒక ‘ క్రమ పరిణామం.’   ఇదొక సహజగతి ‘  HYPOTHESIS, OBSERVATION, EXPERIMENTATION AND INFLUENCE  అనే      SCIENTIFIC PROCESS  కు ఇదొక ప్రతిరూపం వల్లీ దేవసేనా  సమేతుడైన