అజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు .“ నువ్వు తెర వెనుక వ్యక్తివి . పైగా మేము నియమించిన వ్యక్తివి . నిన్నెవరూ అంతగా పట్టించుకోరు . ఈ లోకం దృష్టి నా మీద ఉంది . నేనీ తాకిడి తట్టుకోవాలంటే ఆమెను ఎలాగైనా కలవాలి . చేసిన తప్పు ఒప్పుకొని ఆనాటి సంఘటనలు బయటపెట్టొద్దని మంచిగా, మన్ననగా ఒప్పించాలి . ఆమెకు నా వల్ల ఎలాంటి అపాయం ఉండడని భరోసా కలిగించాలి . నా సమస్య కు సమాధానం నేనే ! సమస్యా పరిష్కారం నా బాధ్యత .“ మీది చాలా మంచి నిర్ణయం అజయ్ బాబు ! మీరు అప్పటిలా ఆవేశపడక , నాలాంటి మరో క్షుద్రున్ని సంప్రదించక ప్రశాంతమైన మనసుతో ఆలోచించారు .తప్పక మీ ప్రయత్నం ఫలిస్తుంది . నాదొక చిన్న మనవి . దైవం ఇచ్చిన తల్లిని దూరం చేసి రాహుల్ బాబుకు మనం చాలా అన్యాయం చేశాం