నీడ నిజం - 30

  • 3.8k
  • 1.5k

పై కీలక సమావేశం జరుగుతున్నా సమయం లో విద్యా తన గది లో ఆలోచనలతో సతమతమవుతోంది . “ తన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఎందరు ఆరాటపడుతున్నారు .? మానసిక స్థాయి, , సంస్కారం పెంచుకొని సాగర్ , పుత్రికా వాత్సల్యంతో భరత్ రామ్ అంకుల్, డాక్టర్ అంకుల్ ; అనురాగం, పూర్వ జన్మ బంధం తో రాహుల్, తను తప్పక లక్ష్యం చేరుకోవాలని, కోమల కు న్యాయం జరగాలని జస్వంత్,---ఇందరి అండ దండలు తనకు తోడు నీడ గా ఉన్నప్పుడు ఎందుకు భయ పడాలి ? అయినా తనకు స్థిమితం లేదు . మనసులో ఇంకా వెలితి . కారణం ఏమిటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేసుకుంది . ఎంత మధన పడినా జవాబు స్ఫురించటం లేదు . అలసటగా కాసేపు కళ్ళు మూసుకుంది . మనసు నిగ్రహించుకోవటానికి శ్వాస మీద దృష్టి నిలిపింది .