జతగా నాతో నిన్నే - 25

  • 3.8k
  • 1.9k

భూమి పైన మాయమైనా రాహుల్ నేరుగా డ్రాకులాల రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చుట్టూ పరికించి చూస్తే , తనకి ఏదో తేడా కనిపించింది . గాలిలో ఈ వాసన ఏంటి ? చాలా వింతగా ఉంది . ఈ గ్రామంలో ప్రజలు ఉండాలి కదా ! ఎక్కడికి వెళ్లారు ? అంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు . ఇంతలో ఏవో అరుపులతో తనపైన ఒక పది, పదిహేను దయ్యాలు దూకాయి . అవి అలా రాహుల్ పైకి దూకగానే తను వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నాడు . కానీ తనతో పాటు తీసుకువచ్చిన శవలను మాత్రం మాయ చేయలేకపోయాడు . ఆ దయ్యాలు పిచ్చి పట్టిన వాటిలాగా ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొరకడం మొదలుపెట్టాయి. అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో రాహుల్ కి అర్థం కాలేదు . ఈ సామ్రాజ్యంలో నేను యువరాజుని ప్రతి ఒక్క దయ్యానికి తెలుసు! కానీ