జతగా నాతో నిన్నే - 16

  • 3.8k
  • 2k

గీతకు జరిగిన విషయాన్ని కాఫీ షాప్ యజమానికి కూడా చెప్పి, కొన్ని రోజులు తన కోసం సెలవులు అడిగారు. తన పని కూడా వాళ్లే చేస్తామని హామీ కూడా ఇచ్చారు . ఆయన అదేమీ వద్దు .తనకి నేను డబ్బులు ఇస్తాను. మీ పని మీరు చేయండి చాలు! అంటూ ఒప్పుకున్నాడు . ఎంతైనా మూడు సంవత్సరాలుగా అతడి దగ్గరే పని చేస్తున్నారు వాళ్ళు . తన కింద పని చేసే వాళ్లపైన ఆమాత్రం అభిమానం ఉండటంలో తప్పులేదు కదా!. అప్పుడే కాఫీ షాప్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు అభయ్ . అతడు వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లిన అన్వి అతని చూసి , “ సార్ మీకు ఏం కావాలి ....” అంటూ ప్రశాంతమైన వదనంతో అడిగింది . అంత బాధ పడుతూ కూడా ఎలా ఇలా? అంటూ ఆమె మొఖం వైపు