జతగా నాతో నిన్నే - 15

  • 3.9k
  • 2k

లారీ డ్రైవర్ వేగంగా తనని ఢీకొట్టి కాస్త ముందుకు వెళ్లి లారీని ఆపేశాడు .అక్కడినుండి లారీని వదిలేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు .కొన ఊపిరితో కొట్టుకుంటూ శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ రక్తమాడుపులో ఉంది గీత. ఆమెకు “ గీత.....” అంటూ తన వైపే వస్తున్న మాటలు మాత్రమే వినిపించాయి. నెమ్మదిగా గీత కళ్ళు మూతపడ్డాయి. “ గీతా......గీత నీకేం కాదు. నేనున్నాను ” అంటూ ధైర్యంగా తను నిద్రపోకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అన్వి. సంజన కింద భూమి అంత కనిపించినట్టు అనిపించింది .తన ఎదురుగా రక్తం మడుపులో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితురాలిని చూసి చలించిపోయింది . గీత తలకున్న రక్తం ,అన్వి వేసుకున్న బట్టలకి మొత్తం అయింది. తన చేతులకి అంతా అయింది. గీత అంటూ గట్టిగా గొంతు తడి పూర్తిగా ఆరిపోయే ఏడుపు మాత్రమే తనకు వస్తుంది. చుట్టుపక్కన ఎవ్వరూ లేరు . ఆ రోడ్డుపైన కొంచెం దూరంలో