జతగా నాతో నిన్నే - 09

  • 4.3k
  • 2.4k

“ మనము ఈసారి ఎలాగైనా గాని కాంపిటీషన్లో గెలవాలి . నాకు తెలిసి ఈసారి యాభై వేలు కాబట్టి ఒక్క కాంపిటీషన్ పెడతారనుకుంటా ” అంది గీత సందేహిస్తూ . “ ఒక కాంపిటీషన్ అయితే ఎలా గెలవనగలుగుతాం మనం. ఛ ఇంతసేపు మనం గెలుస్తామనుకున్నాను కాదే! ” అంది అన్వి బాధగా . “ ఉట్టికేగరలేనమ్మ ,ఆకాశానికి ఎగిరింది అంటా! అట్టుంది నీ పంచాయతీ .కాంపిటీషన్లో గెలిచి, ప్రైస్ తీసేసుకున్నట్టు అప్పుడే ఊహలు కూడానా ?” అంటూ నిజాన్ని వెళ్ళగకింది గీత. “ అవునే మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి అడిగి కనుక్కుంటే సరిపోద్ది . ఎందుకని మనలో మనం గొడవ పడుతున్నాము ” అంది ఆలోచిస్తున్న సంజన . “ నువ్వు చెప్పింది బాగానే ఉంది. వెళ్లి అదే చేద్దాం ” అంటూ పైకి లేయబోయారు ముగ్గురు . వాళ్ల ముందరే ఆ మాటలు వింటున్న అభయ్ ఇంకా