జతగా నాతో నిన్నే - 05

  • 5.1k
  • 2.9k

నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...ఏయ్ ...ఏ ” అంటూ శబ్దం చేస్తూ అందర్నీ నిద్రలేపేసింది. “ అబ్బా ఏంటి? కాసేపు పడుకున్న తర్వాత నన్ను లేపొచ్చుగా! ఎదవ గోల వేసుకుని ఆ ఫోను ఒకటి ” అంటూ కసిరినట్టుగా అరిచి మళ్లీ పడుకుంది సంజన. “ చాలు చాల్లే ! మళ్ళీ లేట్ అయిందని ఏడుస్తావు. టైం కి మనల్ని నిద్ర లేపుతున్న ఈ ఒక్క ఫోన్ నన్న జాగ్రత్తగా చూసుకుందాం ” అంటూ పగిలిపోయిన స్క్రీన్కి ఒక మూడు రబ్బర్ బ్యాండ్ లేసి మరి వాడుతుంది అన్వి. “ థాంక్స్ రా బుజ్జి ,టైం కి లేపావు ” అంటూ ముందు దానికి గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూంలోకి దూరింది . తను పూర్తిగా రెడీ అయిన