జతగా నాతో నిన్నే - 01

  • 12.2k
  • 2
  • 7.3k

ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది . ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు స్పష్టంగా ఒక పాదదర్శకం తేరలా కనిపించింది. ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి . ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి. అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది