ఎదురుగ ఉన్న అపరిచిత వ్యక్తుల్ని ప్రశ్నార్థకం గా చూశాడు భరత్ రామ్ . “ జస్వంత్, జర్నలిస్ట్, ...హి ఈజ్ రాహుల్.” మర్యాద పూర్వకం గా చేయి కలిపాడు . భరత్ రామ్ కళ్ళలో మెరిసిన ఆశ్చర్యం; జస్వంత్ , రాహుల్ కూర్చున్నారు . “జస్వంత్ ! చెప్పండి. “ జస్వంత్ విద్యాధరి డైరీ టేబుల్ పై ఉంచాడు . “ఈ డైరీ.....? “ విద్యాధరి గారిది . మీరు దిగిన లాడ్జ్ రూము లో వార్డ్ రోబ్ పై అరలో కనిపించింది .” ఈ ఆయుధం తో నే ఇంత సంచలనం సృష్టించారు కదూ .?” జస్వంత్ జవాబు.....చిరునవ్వు “ ఈ డైరీ చదవాలని మీకు ఎందుకు అనిపించింది . ...It reflects the mind of a lady….her sensitive feelings and thoughts. ..ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదు . ..కానీ ముత్యాల సరాల్లాంటి అక్షరాలూ