నీడ నిజం - 16

  • 3.6k
  • 1.8k

కోమల పద్మాసనం లో నిటారుగా, యోగినిలా ఉంది . చూపులు నేల వైపు, మొహం లో ఏ భావం లేదు . ఎవరేం చెప్పినా బదులు లేదు . మౌనం -------అందరి మతులను పోగొట్టే మౌనం .!పన్నాలాల్ కు పరిస్థితి అర్థమైంది . ఆమెను కాస్త కదిలించే ప్రయత్నం చేయాలి . కోమల కు ఎదురు నిల్చున్నాడు . స్వరం మార్చి , విజయ్, తేజ్ సింహ లకుఅనుమానం రాకుండా “ అ మ్మా ! కోమలా అని మెల్లగా పిలిచాడు . కోమల ఉలిక్కిపడి పన్నాలాల్ ను చూసింది . కళ్ళు కలుసుకున్నాయి .“ చూడమ్మా కోమలా ! ఇందరు పెద్దలు ఇంతగా ప్రాధేయ పడుతుంటే మౌనంగా ఉండటం భావ్యం కాదు . అవతల ఆ పుణ్యాత్ముడికి అంత్యక్రి యలు జరగాలి . త్వరగా నీ మనసులో మాట వారికి చెప్పమ్మా . !” పన్నాలాల్ ‘సూచన ‘ చేశాడు