నీడ నిజం - 11

  • 4.4k
  • 2.1k

అఘోరి విక్రం లోగిలి లో అడుగు పెట్టగానే అప్రయత్నం గా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుకు కారణం అతడికి స్పష్టం గా స్ఫురించలేదు. కానీ, ఏదో అర్థం కాని అపశ్రుతి మనసు లో మెదిలింది . వెంటనే ఆ అనుభవం దంపతులకు వివరించాడు. జాగ్రత్త గా ఉండమని సూచన చేసాడు.విక్రం ఆ సూచన అంతగా పట్టించుకోలేదు. ఆడది కనుక కోమల కొంత జంకింది . ఏం జరుగుతుందో అన్న భయం ఆమె లో కాస్త అలజడి రేపింది .ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓ ఎండవేళ , ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ లేని సమయాన ఓ ఆగంతకుడు విక్రం ఇంటి ముందు ‘ భిక్షాందేహి’ అంటూ నిలుచున్నాడు. అతడు ఔత్సాహిక క్షుద్రోపాసకుడు –పన్నాలాల్. ఆ పిలుపు విన్న కోమల భిక్ష వేసి వెళ్లి పోయింది. ఆ యువకుడు వెంటనే కదలలేదు .ఒక్క క్షణం చుట్టూ అనుమానం గా చూసాడు .