నీడ నిజం - 9

  • 4.2k
  • 2k

తల్లి మనోవేదన చూసి కూడా వారు కదలలేదు.మెదలలేదు.తమ వైఖరి మారదన్నట్లు మౌనంగా వుండిపోయారు. విషయం తెలిసి విక్రమ్ బిగుసుకు పోయాడు.తనంటే ప్రాణం పెట్టే తమ్ముళ్ళే తన నిర్ణయాన్ని హర్షించలేక పోతున్నారు. ఇప్పుడు తనేం చేయాలి ? తమ్ముళ్ళ కోసం తన నిర్ణయాన్ని వెనక్కు తీసికోలేడు. అలాగని తమ్ముళ్ళను ఒప్పించ లేడు. తన అవసరం తనది.వారి ఆలోచనలు,అభ్యంతరాలు వారివి. రెండూ సమాంతర రేఖలు. తమ్ముళ్ళను పిలిచాడు. తమ ప్రవర్తన కు అన్ని గట్టిగా మందలిస్తాడని వారూహించారు. అన్నకు ఏ సమాధానం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. అన్నను ఎదిరించలేరు..ఆయన నిర్ణయాన్ని ఆమోదించలేరు. చిత్రమైన పరిస్దితి. “...కోమలి తో నా వివాహం మీకు నచ్చలేదు. అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. నా కోసం మీరు దిగి రావాల్సిన పని లేదు. మీ అభ్యంతరాలు మీవి.నా సమస్య నాది. మనది రాజవంశం.మన చరిత్ర గొప్పదన్న స్పృహ నాకూ వుంది...ఈ పరగణాన్ని. శాశిస్తూ అందరికీ ఆదర్శంగా వుండే