నీడ నిజం - 8

  • 4.1k
  • 1.9k

రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల ఎర్ర తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ఉత్సాహం -ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగాడు. చివరి మెట్టుపై పేరుకు పోయిన నాచు మొక్కలు రాహుల్ కాలుజారి చెరువులో పడేలా చేసాయి. అంతే భయం తో రాహుల్ పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రాహుల్ నీళ్ళలో పడిన చోట లోతు ఎక్కువ. అందుకే నేల అందక నీళ్ళపై గిలగిల కొట్టుకుంటున్నాడు. క్షణాల్లో పరిస్థితి విషమించింది. ఎవరో ఒకరు సాహసం చేయకపోతే ఓ పసి ప్రాణం నీటి పా లవుతుంది. కోమల క్షణం ఆలస్యం చేయలేదు. మొండి ధైర్యం తో చెరువులో దూకింది.గట్టు మీద ఆడవాళ్ళు ‘జాగ్రత్త,జాగ్రత్త’ అని అరుస్తున్నారు. ఎలాగో ప్రాణాలకు తెగించి కోమల రాహుల్ ను