నీడ నిజం - 5

  • 4.3k
  • 2.1k

అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన కారణం ఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి.