నీడ నిజం - 2

  • 5.7k
  • 3.3k

రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద