ఆ ముగ్గురు - 47

  • 3.2k
  • 1.2k

అన్వర్ చిన్నగా దగ్గాడు. అలీ, యాకూబ్ లు అతడిని చిరునవ్వు తో చూశారు. " ఇది కలా నిజమా! ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా కూర్చోవడం " అన్వర్ వారిద్దరినీ చూశాడు." ఈ కలను నిజం చేసిన వాడికి మనం జన్మంతా ఋణపడి ఉండాలి " అలీ స్పందన. " ఎటు వెళుతున్నామో తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు.గమ్యం లేని చీకటి ప్రయాణం. ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది. "" ఇనాయతుల్లా సాబ్ చెప్పింది ముమ్మాటికీ నిజం. మతమే దేవుడు కాదు. మతమే జీవితం కాదు. రాముడైనా, రహీమైనా ఓ మంచి భావన. మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభవం. . " క్షణం ఆగాడు అన్వర్. అతడి కళ్ళల్లో మెరుపు. భాషకందని అవ్యక్తానుభూతి. అలీ, యాకూబ్ తమ ఉనికినే మర్చిపోయారు. " అలీని సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్ళాక ఆ చీకటి లో చలిలో సాధువు ఆశ్రమం వరకు ఎలా నడిచానో ?