ఆ ముగ్గురు - 43

  • 3.2k
  • 1.3k

అన్వర్ అభ్యర్థన ను ఇంతియాజ్ ఖాతరు చేయలేదు. అతడి తొందర, ఆరాటం అతడిని ఓపిగ్గా ఉండనివ్వలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఊరుకుంటారు ? అరగంట లోపే అన్వర్ బృందం తలదాచుకునే ప్రదేశం గుర్తించగలిగాడు . వాళ్ళక్కడికిచేరకముందే తన ఫోర్స్ తో ఆ ప్రదేశం దరిదాపుల్లో పొజిషన్ లో ఉండి పోయాడు. ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ తను జారవిడుచుకోలేడు. ఇటు డిపార్ట్మెంట్ , అటు డ్రగ్స్ రాకెట్ . విశాల్ ఆత్మహత్య పెనుసవాళ్ళు. ప్రభుత్వ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి. పందొమ్మిది మంది డ్రగ్ బ్యాంకర్స్. అన్వర్ పోలీస్ వలయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. పెద్దగా ప్రతిఘటన కుఆస్కారం లేకుండా పోయింది. అంతగా కట్టుదిట్టం గా ప్లాన్ చేశాడు ఇంతియాజ్. అటూ ఇటూ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఆపరేషన్ విజయవంతం అయింది. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంతియాజ్. ఆ రోజు సాయంత్రమే ప్రెస్ మీట్. విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో