సాగర్ "బి" స్కూల్ లో విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు సిటీ కి రావద్దు. ఇంట్లో కూడా ఉండొద్దు." ఉదయం నాలుగు గంటలకు రహీం నుండి ఫోన్. యాకూబ్ తొలి తిరిగి పోయింది. నిద్ర మత్తు మంచులా కరిగి పోయింది. లేచి బయటకు వచ్చాడు. వసారా అరుగు మీద కూలబడి పోయాడు. పదేపదే విశాల్ గుర్తొస్తున్నాడు. డబ్బు మదం, గర్వం సమపాళ్ళల్లో ఉన్నా తన దగ్గర ఎప్పుడూ ప్రదర్శించలేదు. తను మాట తీరుతో, ప్రవర్తనో తనతో చాలా స్నేహంగా ఉండేవాడు. అందుకు తను అందించే డ్రగ్స్ ఏమాత్రం కారణం కాదు. అతడికి ఈ అలవాటు ముందే ఉంది. తనవల్ల అతడు చెడిపోలేదు. ఎందుకో అతడి మాటల్లో, నవ్వులో వెలితి లీలగా ధ్వనించేవి. " యాకూబ్" తల్లి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు. " నిద్ర పట్టలేదా" ప్రక్కనే కూర్చుని తలపై ప్రేమగా నిమిరింది. ఆ స్పర్శ అతడిని కదిలించింది. గుండెల్లో గూడు