ఆ ముగ్గురు - 41

  • 3.6k
  • 1.4k

ఉత్తరం చదివి విశాల్ వైపు జాలిగా చూశాడు. తన సెల్ మోగటం తో బయటకు వెళ్ళాడు. అవతల అన్వర్.." రహీం ఫోన్ చేశాడు. నన్ను నా టీం తో అండర్ గ్రౌండ్ కు వెళ్ళమన్నాడు . ఇలాంటి పరిస్థితి వేస్తే మమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచుతారు.ఒక విధంగా హౌస్ అరెస్ట్ " ." ఎక్కడికి వెళుతున్నారు ?"" అన్వర్ ఆ ప్రదేశము వివరాలు చెప్పాడు. " అలాగే వాడు చెప్పినట్లే చెయ్యి. ఇంతియాజ్ తో నేను మాట్లాడుతాను. "" అలాగే. సిటీ లో ఉన్న మేమందరం కలిసి రహీం చెప్పినప్రదేశానికి చేరేటప్పటికి మూడు గంటలు పట్టొచ్చు. అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు సార్ తో ఈ మాట చెప్పండి. " అన్వర్ అభ్యర్థన.ఆదిత్య వెంటనే ఇంతియాజ్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. ఇంతియాజ్ నిట్టూర్చాడు. " పూర్ విశాల్ ! తను చనిపోతూ డ్రగ్స్ రాకెట్ పునాదులు కదిలించాడు.