ఆ ముగ్గురు - 39

  • 3.6k
  • 1.4k

" మీరే బయలుదేరుతున్నారు. అన్వర్ ఇంటి ముందు నిఘా ఉంటుంది."క్షణం ఆగాడు ఆదిత్య ."అన్వర్ ఇంటి ముందే కాదు. మీ సమతా సదన్ ముందు కూడా నిఘా ఉంది. అయినా ఇబ్బంది లేదు. ఇంతియాజ్ తో అన్నూ విషయాలు వివరంగా మాట్లాడాను. "అరగంట తర్వాత అన్వర్ ఇంటి ముందు ఓ కారు ఆగింది. ఆదిత్య దిగాడు. అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలు. హసీనా (మెహర్ తల్లి) ఆదిత్య ను చూసి పలకరింపుగా నవ్వింది. ఆదిత్య కూడా చిరునవ్వు నవ్వి ప్రక్కనే కూర్చున్నాడు." మీ స్నేహితుడు ఎలా ఉన్నాడు ?"" కోలుకుంటున్నాడు. మరో నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు." ఆదిత్య గొంతు విని కిచెన్ లో ఉన్న మెహర్ హాల్లోకొచ్చింది. " అన్వర్ తోనే మా ఇంటికొస్తానన్నావ్ ?" నవ్వుతూ అంది మెహర్ తల్లి." ఇప్పుడూ అదే మాట. నా మాటలో తిరుగు లేదు "అర్థం కానట్లు చూసింది హసీనా"