ఆ ముగ్గురు - 38

  • 3.4k
  • 1.3k

అన్వర్ ది హిట్ అండ్ రన్ కేసన్న నిశ్చయానికి వచ్చాక నగరం పరిధి లోని అన్ని స్టేషన్ లకు పంపబడింది. అన్వర్ కుఆక్సిడెంట్ అయిన రాత్రి నాటకీయంగా అయిదు హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి.వెంటనే ఆ స్టేషన్ లకు సెర్చ్ టీమ్స్ వెళ్ళాయి. అప్పుడు సమయం అయిదు గంటలు. ఆక్సిడెంట్ జరిగిన రాత్రి ఆదిత్య ఆ స్పాటుకు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు అంబులెన్స్ పంపమని మెసేజ్ పంపాడు. కేస్ క్రిటికల్ అని తెలిసిన హాస్పిటల్ అథారిటీస్ కావలసిన ఎక్విప్మెంట్ తో డాక్టర్ ను పంపారు. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి నిమిషాల్లో హాస్పిటల్ కుపేషెంట్ ను పంపాడు." హిట్ అండ్ రన్ మెడికో లీగల్ కేసు. మీరు పూర్తి బాధ్యత తీసుకుని హామీ ఇస్తేనే మేము కేస్ అటెండ్ అవుతాం. " డాక్టర్ కండిషన్. వెంటనే ఒప్పుకున్నాడు ఆదిత్య. ముందు జాగ్రత్త