" ఒక వ్యక్తి ప్రమాదం లో ఉన్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి కదా ! సందేహం ఎందుకు ? బ్లడ్ ఇవ్వు" " మరి ఇంత రాత్రి...........? "" ఆ దిత్య మనకెంతో కావలసిన వాడు . అతడి విషయంలో నాకెలాంటి భయాల్లేవు." తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మెహర్. ఆదిత్య వచ్చాడు. చనువుగా బెడ్ పైన కూర్చున్నాడు. " నా మీద మీ కున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. మీ మంచిమనసు మీ అబ్బాయిని త్వరగా మీ దగ్గరకు చేరుస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం." ఆదిత్య మాటలకు ఆమె నవ్వింది. రాత్రి పదిగంటల వేళ . చలికాలం. సన్నగా మంచు పడుతోంది. బుల్లెట్ వేగానికి గాలి తీవ్రత పెరిగింది. వెనుక కూర్చున్న మెహర్ అప్రయత్నంగా ఆదిత్య కు అతుక్కు పోయింది. కళ్ళు మూసుకుని అతడి భుజం పై వాలి పోయింది. అతడి స్పర్శ లో అనుభూతి ఆమెను గిలిగింతలు పెడుతోంది.