ఆ ముగ్గురు - 33

  • 5k
  • 1.9k

కళ్ళు గిర్రున తిరిగాయి. తండ్రి మరణ వార్త అతడిని కృంగదీసింది. మెల్ల మెల్లగా మెట్లు దిగి ఎదురుగా ఉన్న షాపు ముందు నిలుచున్నాడు. విహారి కలుసుకున్న ' గడ్డం పెద్దాయన ': అన్వర్ ను ప్రశ్నార్థకంగా చూశాడు. " మామూ" అన్వర్ పెదవులు మెల్లగా కదిలాయి. మామూ అన్వర్ నుండి వెంటనే పోల్చుకోలేక పోతున్నాడు. ఆయన మనసు జ్ఞాపకాల పొరలు చీల్చుకుంటూ వెనక్కిపరుగులు తీసింది. ఆనాటి అన్వర్ కళ్ళముందు మెదిలాడు.ఒక్క ఉదుటున క్రిందికి దిగి అన్వర్ ను దగ్గరకు తీసుకున్నాడు " అన్వర్ మేరే బేటే" ! అన్న పిలుపు అన్వర్ ను కదిలించింది. తడికళ్ళ