ఆ ముగ్గురు - 32

  • 4.7k
  • 1.9k

కొడుకు మంచి స్థితిలో ఉన్నాడని యాకూబ్ తల్లిదండ్రుల గట్టి నమ్మకం. ఆ ప్రేమతో, ఆ నమ్మకం తోనే అతడి ఉద్యోగంవివరాలు అడగలేదు. ఆ మహా నగరంలో యాకూబ్ కొద్ది పాటి జీతం అతడి. ఖర్చులకు సరిపోతుంది. తను గుప్త సంపాదనలో సింహభాగం నాలుగో అక్కయ్య పెళ్ళికి కూడబెడుతున్నాడు. కొడుకు మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. అక్క నిఖా కు బాగానే కూడ పెడుతున్నాడు అని వారి నమ్మకం. " నాన్నా ! బీడీ తాగటం మానేయవా ?" కొడుకు మందలింపుకు బీడీ నలిపి పారేశాడు కరీంఖాన్. " బాగా తగ్గించానురా ! రోజుకు రెండే తాగుతున్నాను. సాయంత్రం కొట్టు కట్టేశాక ఒకటైనా వెలిగించకపోతే ప్రాణం ఊరుకోదు." నవ్వాడు. యాకూబ్ అక్క ఇద్దరికీ టీ ఇచ్చింది. వేడి వేడి తేనీరు ఆ చల్లని సాయంకాలం మెల్లగా చప్పరిస్తుంటే హాయిగా , హుషారుగా ఉంది. " అక్కయ్య కు మంచి సంబంధాలు వస్తున్నాయి. ". కొడుకు