ఆ ముగ్గురు - 31

  • 4.6k
  • 1.8k

అన్వర్ మొబైల్ వెండార్ కనుక ' ఆర్టరీ ట్రాఫిక్ లైన్స్ " లో రద్దీ ఉండే చోట వ్యాపారం చేయలేడు. అతడు అమ్మే వస్తువుల స్థాయిని బట్టి లేబర్ కాలనీల్లో అతడి వ్యాపారం జరుగుతోంది. ఈ ఆలోచనతోనే వాకబు చేస్తూ ఓ లేబర్ కాలనీలో ప్రవేశించాడు ఆదిత్య. అందరూ అన్వర్ కంప్యూటర్ ఇమేజెస్ గుర్తు పట్టారు. అంటే ఈ కాలనీలో అన్వర్ తరుచూ సరుకులు అమ్ముతాడు. అది పెద్ద కాలనీ . ఆశించిన స్థాయిలో సరుకులు అమ్మే అవకాశం ఉంది . పైగా తన ' మాల్' సప్లై కి ఈ కాలనీ చాలా అనుకూలమైంది. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఆదిత్య లో ఉత్సాహం పెరిగింది. అలాగే వాకబు చేస్తూ ఆ కాలనీ చివరకు వచ్చాడు. ఆ చివరి నుండి డబుల్ లైనర్ సిటీని కలుపుతుంది. కాలనీ చివర ఓ చెట్టు క్రింద ఓ చిన్న బంకు ఉంది. అక్కడ బల్లమీద