ఆ ముగ్గురు - 30 - లక్కవరం శ్రీనివాసరావు

  • 4.7k
  • 1.8k

యాకూబ్ ను " బి" స్కూల్ దరిదాపుల్లో వదిలి వెళ్ళి పోయారు పోలీసులు. నెమ్మదిగా తన గదికి చేరుకున్నాడు యాకూబ్. మనసంతా ఏదోలా ఉంది . ఆలోచనలు ఆగిపోయినాయి. మెదడు మొద్దు బారి పోయింది. సాయంత్రం ఆరుగంటలు. మాల్ కోసం రాలేదేమని అన్వర్ నుండి కాల్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం తను ఆరుగంటలకు అన్వర్ ను కలవాలి. ఈ గందరగోళంలో పడి ఆ విషయమే మరిచిపోయాడు. జ్వరం గా ఉంది. రాలేను. రెండు రోజుల తర్వాత కలుస్తానని అన్వర్ కు చెప్పాడు.ఆ రోజు డ్యూటీ కి వెళ్ళలేదు. వార్డెన్ పర్మిషన్ తీసుకున్నాడు. ఓం గ్లాసు వేడి పాలు తాగి హాస్టల్ ముందు లాన్ లో కూర్చున్నాడు. మెహర్ టైం అయింది. హాస్టల్ కారిడార్ స్టూడెంట్స్ తో సందడి గా ఉంది. యాకూబ్ మనసును ఆలోచనలు కమ్ముకున్నాయి. ఆదిత్య కు పవన్ గురించి ఎవరు చెప్పి ఉంటారు ? పవన్ క్లోజ్ ఫ్రెండ్స్