ఆ ముగ్గురు - 29

  • 4.7k
  • 1.9k

హాలంతా గుడ్డి వెలుతురు. ఏమీ కనిపించటం లేదు. గుండెల్ని తరిమే నిశ్శబ్దం. పది నిమిషాల తర్వాత ఎక్కడినుండో ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ లో ఎమోషన్ ఉంది . లాజిక్ ఉంది. ఎలాంటి విషయాన్నైనా ఒప్పించే నేర్పు ఉంది. మీడియం మాడ్యులేషన్ లో, చక్కని ఉర్దూ లో విషయం వివరించే విధానం మిమ్మల్ని కట్టిపడేసింది. అతడు మిమ్మల్ని కొంతకాలం ఇస్లాం మరిచిపొమ్మన్నాడు. మేము ముస్లిం అన్న విషయం కూడా మరిచి పొమ్మన్నాడు. మా కిచ్చిన పాత్ర లో నేర్పుగా ఇమిడిపొమ్మన్నాడు . యువశక్తి బలపడితే గాని సమాజంలో ముస్లిం ల బలం పెరగదు. జీహాద్......... రాజకీయ రంగు పులుముకున్న జీహాద్ యువకుల్ని బలి తీసుకుంటుంది. అందుకే మా సోషియో - ఎకనామిక్ స్టేటస్ పెంచుకొమ్మన్నాడు. డ్రగ్స్ మత్తులో పడి భారతజాతి బలహీనపడుతుంది. వారి బలహీనతే మా బలం. చేతినిండా కాసులు. ప్రాణభయం లేదు. సింపుల్ హ్యాకర్స్ వర్క్. మాలాంటి పేదలకు