ఆ ముగ్గురు - 28 - లక్కవరం శ్రీనివాసరావు

  • 4.4k
  • 1.7k

" నేనీ రోజు డ్యూటి లో లేను . నమాజు కు వెళుతుంటేమీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు . డ్యూటి లో లేనప్పుడు నా దగ్గర పిస్టల్ ఉండదు . " " కంటిన్యూ " ఇంతియాజ్ తొందర చేశాడు . " ముందొక పైలట్ ప్రాజెక్టు అనుకున్నారు . ఇందుకోసం సెలెక్ట్ చేసిన వారిలో ఇరవై మందిని క్రీమ్ బ్యాచ్ గా సెలెక్ట్ చేశారు . వారిలో నేనూ ఒకడిని. వారు సెలెక్ట్ చేసిన ఇరవై కార్పొరేట్ కాలేజీ లలో మేము చిన్న ఉద్యోగం సంపాదించాలి . మరో విషయం అన్నీ colleges సిటీ లిమిట్స్ లో ఉన్నవే . వాటిల్లోడ్రగ్స్ అలవాటు ఉన్నవారిని హూర్తయించాలి. వారి ద్వారా కొత్తవారికి వల వేయాలి . వారికి ముందు శాంపిల్స్ ఇచ్చి ఊరించాలి . ఆపై జరగాల్సింది సిక్స్ లైనర్ హై వే బుల్లెట్ లా దూసుకు వెళుతుంది ."