నా ఫిలాసఫీ పార్ట్__3(b)మనల్ని మనము ప్రేమించుకోవడం సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ,ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని... అది "మనల్ని మనం ప్రేమించుకోవడం"... ప్రేమ అనేది అద్భుతమైన ఔషధము ....మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.... మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే.... మనం సాధించిన అభివృద్ధికి లేదా, విజయాలకు గర్వపడడమో,లేక అహంభావంతో ఉండడమో, లేక మీరు ఉన్న స్థితితో పోల్చుకొని ఇతరులను తక్కువ చూడడమో, కాదు ....ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు.... ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది, మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవం అవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల ,మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల, మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి.....ఇక్కడ" ప్రేమ "అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం ....ప్రేమ అనేది జీవితపు ఏ