తన పరిస్థితికి కరువుతీరా ఏడవాలనిపించింది . బాధను పంచుకునే నేస్తం అలీ దూరమయ్యాడు . రహీమ్ తన వింగ్ లీడర్ రోబో లాంటి వాడు . బిజినెస్ తప్ప మరో విషయం మాట్లాడడు . అతడికి ఇచ్చిన శిక్షణ అలాంటిది . అన్వర్ ఇంటి వరకు వెళ్ళే సాహసం చేయలేదు . తల్లితండ్రుల మొహం చూసే ధైర్యం లేదు . పైగా తన మీద గట్టి నిఘా ఉంది . ఇంటికి వెళ్ళి , తన ఉనికి డిపార్ట్మెంట్ కు తెలిసి తను పట్టుపడితే , తల్లిదండ్రులకు సమాజం లో స్థానం ఉండదు . తనకు జీవితమే ఉండదు . అందుకే ఆ ప్రయత్నం చేయరాదనుకున్నాడు . ఆ రోజు పెద్దగా పని లేదు . సాయంత్రం వరకు అడ్డదిడ్డంగా ఊరంతా తిరిగి అర్థరాత్రి ఇల్లు చేరుకున్నాడు . విశ్వనాధ శాస్త్రి ఇంట్లో శాస్త్రి, సునీత , అమల