విజయానికి ఐదు మెట్లు....

  • 21.2k
  • 2
  • 8.1k

1.మొదటి బాగం........ అధ్యాయం:-1 ......గెలుపుకి పునాది ఓటమి..... ***************************** 1.... జీవితం ఒక యుద్ధం జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు,భాద్యతలు కాదు,చిన్న చిన్న ఆనందాలూ,కాస్త దయా నిరంతరం చిరునవ్వు....అదీ జీవితం అన్నారు ఒక వేదాంతి...... నిజమే అదే జీవితం కానీ, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమా???నేటి రోజుల్లో మనిషి జీవితం రోజురోజుకీ,ఒక యుద్దంలా మారుతోంది.....ఇందులో ప్రత్యర్థి అంటూ ఎవరూ ఉండకపోవచ్చు.. పరిస్థితులు, కావచ్చు,ఆకస్మిక విపత్తులు, కావచ్చు,..... ఏదైనా నిరంతరం యుద్ధం చేయవలసినపరిస్థితి మాత్రం,అనివార్యంగా ఉంటుంది........యుద్ధం ఎందుకు చేయాలి....యుద్దాలు కేవలం స్వార్థం కోసమే రావు,మనుగడ కోసం కూడా మనం యుద్ధం చేయక తప్పదు,నేను యుద్ధం చేయను,అని కూర్చుంటే శత్రువు మనల్నిఆక్రమించేస్తాడు.... ఉదాహణకు,ఒక ఆఫీసులో పని చేసే గుమాస్తాకి, ప్రమోషన్ కోసం,అదే పదవి కోసం,పోటీ పడుతూ ఉన్న మరో వ్యక్తితో,యుద్ధం చేయవలసి రావచ్చు....పెన్షన్ కోసం ఒక వృద్దుడు,ప్రభుత్వంతో పోరాడవలసి రావచ్చు.... అంత వరకూ ఎందుకు స్కూల్లో అప్పుడే చేరిన ఐదు ఏళ్ల కుర్రవాడు,ఆ