ఈ అటాక్ లో మూడు వందల కన్నా కాస్త ఎక్కువే మిలిటెంట్లు చనిపోయారు. ఇదెలా సాధ్యం ? ఆర్మీ పర్సనల్ అంత కచ్చితంగా వారి ట్రైనీ క్యాంప్స్ ను ఎలా లొకేట్ చేయగలిగారు? ఆ స్థావరాల టోపోగ్రఫీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండాలి."" ఆ వ్యక్తి అలీ కాదు గదా ! అన్వర్ లో చిన్న ఆశాకిరణం.అలీ జీవించి ఉన్నాడన్న ఆలోచన అన్వర్ మనసును తేలిక పరిచింది. ఏమాత్రం సందేహం లేదు. అలీ సహకారం లేనిదే ఈ ఆపరేషన్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయితే ఛాన్సే లేదు. ఇప్పుడు అలీ తన గ్రామం లో తన వాళ్ళతో కలిసి ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంటాడు.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు......... అన్వర్ మనసు లో ఊహ.కానీ ఆ ఊహ తప్పదు. సర్జికల్ స్ట్రైక్ లో అతడి సహకారానికి ప్రతిఫలం గా on compassionate and grounds అతడిని ఆర్మీ లో