ఆ ముగ్గురు - 21 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.2k
  • 2.2k

మెహర్ ఇల్లు చాలా సాదాసీదాగా ఉంది. ఆ చిన్న హాల్లో స్టూల్ మీద కూర్చున్నాడు ఆదిత్య. కాసేపట్లో టీ ప్రేమతో మెహర్ వచ్చింది. ఓం కప్పు ఆదిత్య తీసుకున్నాడు. మరో కప్పు మెహర్ తీసుకుంది.మెహర్ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అతడి చూపులు హాలు మొత్తం చుట్టాయి. అప్పుడు గోడకు తగిలించిన ఓ ఫోటో అతడికి కనిపించింది. ఓం పదహారేళ్ళ అబ్బాయి, పదేళ్ళ అమ్మాయి ఫోటో అది." ఆ అమ్మాయి మీరు. .......ఆ అబ్బాయి....?"" మా అన్నయ్య" మెహర్ ముఖంలో ఏ భావమూ లేదు." అన్నయ్యా ? మీకో అన్నయ్య ఉన్నాడని ఎపుడూ చెప్పలేదే ! " ఆశ్చర్యం గా అడిగాడు ఆదిత్య." ఇల్లు వదిలి వెళ్ళి పోయి పదిహేను సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉన్నాడో ? ఏం చేస్తున్నాడో ? తిరిగి రాని వాడి గురించి ఏం చెప్పేది ?" మెహర్ మొహంలో దైన్యం."ఇల్లు వదిలి అంత చిన్న వయసులో