Love, Life and Vitamin M - 2

  • 7.1k
  • 2.8k

రెండో కథ : నమ్మకం ఒక చెరువు అలుగు పోస్తున్నది. దాని దగ్గర ఒక అమ్మాయి, అబ్బాయి ఆడుకుంటున్నారు. అబ్బాయికి ఇసుకలో చాలా రంగు రాళ్ళు దొరికాయి. అమ్మాయికి మాత్రం ఒక్కటీ దొరకలేదు. కానీ, ఆమె దగ్గర ఇంటి నుంచి తెచ్చుకున్న రవ్వ లడ్డూలు చాలా ఉన్నాయి. అబ్బాయికి ఆశ కలిగింది. "నేను నీకు ఈ రంగు రాళ్ళన్నీ ఇస్తాను. నువ్వు నాకు నీ లడ్డూలన్నీ ఇచ్చేస్తావా?" అని అమ్మాయిని అడిగాడు అబ్బాయి. అందుకు అమ్మాయి ఒప్పుకుంది. అబ్బాయి ఒక రాయి దాచుకుని మిగిలిన రాళ్లన్నీ ఇచ్చేశాడు. అమ్మాయి మాత్రం మొత్తం లడ్డూలు ఇచ్చేసింది. ఆ రోజు రాత్రి.. అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమెది నమ్మకం. పూర్తి విశ్వాసం. అబ్బాయికి మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకంటే, తను ఒక రాయి దాచుకున్నట్లే.. ఆ అమ్మాయి కూడా ఒక లడ్డూ దాచుకుని ఉంటుందేమోనని అతని అనుమానం. ఇలాగే మనం ఎవరిని