ఆ ముగ్గురు - 18 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.2k
  • 2.2k

విశ్వనాథ శాస్త్రి గారి లోగిలిలో సందడి. అమల కొత్త బట్టల్లో మెరిసిపోతుంది . శాస్త్రి కి , సునీతకు పాదాభివందనం చేసింది. అమల తమ్ముడు ఆనందంతో చప్పట్లు కొడుతూ అక్కను ' హాపీ బర్త్ డే టు యూ' అని అభినందిస్తున్నాడు.అనంత్ రామ్ ( అన్వర్) వారినే కన్నార్పకుండా చూస్తున్నాడు . పెదవులపై చిరునవ్వు. కళ్ళల్లో నీలినీడలు . " అన్నయ్యా " అమల అనంత్ రామ్ పాదాలు తాకింది." నేనా ?" అనంత్ రామ్ ఆశ్చర్య పడి పోయాడు ." ఏం అన్నయ్య చెల్లెల్ని దీవించడా ?" సునీత అనింది.ఆ మాటలకు అనంత్ రామ్ కళ్ళు మెరిసాయి. అక్షింతలు చల్లి అమలు తలను ప్రేమగా నిమిరాడు. జేబులోంచి యాభై రూపాయల నోటు తీసి అమలు చేతిలో పెట్టాడు. " ఈ అన్నయ్య చిరు కానుక". " కానుక విలువ డబ్బు తో కాదు . మనసుతో కొలవాలి." అనంత్ రామ్