ఆ ముగ్గురు - 17

  • 6.1k
  • 2.5k

శీతాకాలం లో పగలు పన్నెండు గంటల సమయంలో ఎండలో నిలబడగలం . యాదగిరి కాలేజీ మెయిన్ గేటు ముందు ఉన్నాడు . అతడి నిరీక్షణ షేర్ ఆటో కోసం. ఆ వీధిలో సహజంగానే రద్దీ తక్కువ . పైగా మిట్ట మధ్యాహ్నం. యాదగిరి సహనానికి పరీక్షే మరి . ఎట్టకేలకు ఆ పైవాడు కరుణించాడు. షేర్ ఆటో వచ్చింది. అందులో ఇద్దరే ఉన్నారు . యాదగిరి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు . ఆటో కదిలింది . ఆ వీధి చివర చిన్న కిరాణా కొట్టు ఉంది . కొట్టు ముందు చిన్న పందిరి . ఆ పందిరికి అటూ ఇటూ రెండు పొడుగు బల్లలు . ఒకదానిపై ఓ యువకుడు కూర్చొని యాదగిరి నే గమనిస్తున్నాడు . అతడికి అనుమానం రాకుండా . షేర్ ఆటో రాగానే ఆ యువకుడు మెరుపులా కదిలాడు . తన ప్రక్కనే ఉన్న