ఆ ముగ్గురు - 16

  • 5.8k
  • 2.3k

జనవరి నెల ఉదయం ఏడైనా బాలభానుడి నునులేత కిరణాలు భాగ్యనగరం పై ప్రసరించలేదు . నగరం ఇంకా చలిదుప్ఫటి ముసుగులో జోగుతూనే ఉంది . సిక్స్ లైనర్ హైవే - రద్దీ అంతగా లేదు . ఇంతియాజ్ ఫోర్ వీలర్ మెల్లగా ముందుకు సాగుతోంది. అతడి ఆలోచనల అలజడి కారు వేగాన్ని నియంత్రించ గలిగింది . " ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ? ఈ ప్రశ్న అతడిని ఓ పట్టాన వదలడం లేదు. ఆ రోజు జనవరి పన్నెండు. నేషనల్ యూత్ డే . వివేకానందుని పుట్టినరోజు . ఇంతియాజ్ కారు ఓ కాలనిలో ప్రవేశించింది . కాలనీ లోని కమ్యూనిటీ ప్లేస్ లో వివేకానందుని జయంతి సభ జరుగుతోంది . షామియానా ముందు వివేకానందుని నిలువెత్తు ఫ్లెక్స్ బ్యానర్ అందరి దృష్టిని అయస్కాంతం లా ఆకర్షిస్తోంది . కాషాయి లుంగీ లో చేతులు కట్టుకుని నిశితంగా చూస్తున్న ఆ