కలికివాయి బిట్రగుంట . చెన్నై -కోల్ కటా నేషనల్ హైవేస్ -5నుండి అరకిలో మీటరు ఎడమవైపు డైవర్షన్ రోడ్లో వెళితే కనిపించే గ్రామం . మరీ పెద్దది కాదు.మరీ చిన్నది కూడా కాదు. ఆ ఊరే ఇంతియాజ్ పుట్టిన గడ్డ. ఒక్క ఇంతియాజే కాదు, రెవెన్యూ మంత్రి షేక్ మస్తాన్, హోంమంత్రి పరాంకుశ రావు, మిషన్ జన్నత్ వ్యవస్థాపకుడు ఇనాయతుల్లా ఆ గడ్డ పైనే ఊపిరి పోసుకున్నారు. ఇంతియాజ్ తండ్రి ఒక హైస్కూల్ టీచర్. మస్తాన్ తండ్రి ఆ గ్రామం పోస్టాఫీసు నుండి సమీపంలో ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న శింగరాయ కొండ సబ్ పోస్టాఫీసు కుఉత్తరాల సంచులు మనిఆర్డర్లు బట్వాడా చేసే చిరుద్యోగి. పరాంకుశ రావు తండ్రి గ్రామం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్. ఆయనకు పోస్టుమాస్టర్ గిరి ఓ పార్ట్ టైం జాబ్ లాంటిది . చాలినంత భూవసతి ఉన్న రైతు సోదరుడు