నా మనసు మనువాడింది నిన్ను

  • 27.7k
  • 8.9k

దివ్య వాళ్ళ ఇల్లు ఒక్క ఇంద్రభవణంలా ఉంది అలాంటిది దానికి ఈరోజు పుష్పాలతో అలంకరించి ఆ భావనని మరింత అందంగా చేశారు ఎందుకంటే ఈరోజు దివ్య వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు దివ్య పేరు మీద ఆ హోమం చేయించడానికి దేశంలో ఉన్న పెద్ద పూజారులు పీఠాధిపతులు యోగులు మునులు ఋషులు వీళ్ళతో పాటు జగదీష్ చంద్ర వర్మ గారి వంశాన్ని... కుటుంబాని తరతరాలుగా రక్షిస్తూ వస్తున్న శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విశ్వనాథ గురువు గారు కూడా వచ్చారు వాళ్ళందారు దివ్య కోసం హోమం దగ్గర మంత్రాలు చదువుతూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో దివ్య వాళ్ళ మేనమామ పరశురామ్ వచ్చి. పరశురామ్: ఇదిగో పి.ఎ చక్రి..ఆడంబరాలు చూస్తుంటే చాలా ఘనంగా చేస్తున్నారే ఎ మాత్రం కర్చు చేస్తున్నారు ఎంటి మా బావగారు...? పి.ఎ చక్రి: పదిహేను వందలు దాకా కర్చు చేస్తున్నారు సార్. పరశురామ్: