ఆ ముగ్గురు - 14 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.5k
  • 2.1k

కాలేజి ఓపెన్ ఆడిటోరియం లో ఫ్రెషర్స్ డే జరుగుతున్నది. ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ, కొంతమంది సీనియర్స్, ధైర్యం కూడగట్టుకుని కొంతమంది జూనియర్స్ మాట్లాడారు . ఇదిలా ఒక్కసారి గా అభిప్రాయాలు, అభిరుచులు పంచుకోవటంతో కొత్తవారిలో కాస్త బెరుకు తగ్గింది . సంకోచం లేకుండా సీనియర్స్ తో కలిసిపోయారు . చివరి ఐటమ్ డిన్నర్. చేతిలో ప్లేట్స్ తో గ్రూపు లుగా నిలబడి మాట్లాడుకుంటూ తింటున్నారు . ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ మూలకు చేరారు . వారికి కావలసినవి కాలేజీ అటెండెర్స్ సర్వ్ చేస్తున్నారు . వారిలో ఒకరు ఆదిత్య దృష్టి ని ఆకర్షించారు . క్షణం ఒక్కచోట నిలబడకుండా సుడిగాలిలా తిరుగుతున్నాడు . కాసేపు స్టాఫ్ దగ్గర ఉంటాడు . కాసేపు స్టూడెంట్ గ్రూపు ల మధ్య తిరుగుతూ సర్వ్ చేస్తున్నాడు . మాటల చురకలతో, టైమ్లీ జోక్స్ తో అందరినీ నవ్విస్తూ చాలా డైనమిక్ గా కనిపించాడు . మెహర్ ఒంటరిగా ఓ మూల నిలుచుని