ఆ ముగ్గురు - 12 - లక్కవరం.శ్రీనివాసరావు

  • 6.1k
  • 2.6k

ఎంతటి మేధావి నైనా అప్పుడప్పుడు హెచ్చరించేవారు లేకపోతే వారి మెదడు చైతన్యం తగ్గి మందగిస్తుంది . బద్ధకం పని వేగాన్ని , వ్యూహాన్ని తగ్గిస్తుంది . ఇంతియాజ్ విషయంలో అదే జరిగింది. తిరిగి పరాంకుశరావు మందలింపు తో ఉలిక్కిపడి దారిలో పడ్డాడు . ఇంతియాజ్ ఊహ అక్షరాల నిజం . ఆపరేషన్ జన్నత్ లక్ష్యం వెపన్ అటాక్స్ కాదు . వారి వ్యూహం చాప కింద నీరులా సిటీ ని మెల్ల మెల్లగా అల్లుకుంటోంది . ఈ ఆపరేషన్ కు అవసరమైన గుణాలు పుష్కలంగా ఉన్నవాడు అన్వర్ హుస్సేన్. నగర జనవాహిని లో చాలా సులభంగా , సహజంగా కలిసిపోయాడు. చాలా సామాన్యుడు . పబ్లిక్ ప్లేసెస్ లో , స్లమ్స్ లో, తోపుడు బండి మీద చిన్న చిన్న రోజు వారీ వస్తువులను మారుబేరానికి అమ్మే మొబైల్ వెండార్ పేరు అనంత్ రామ్. ఇంతియాజ్ ఊహా చిత్రం