ఆ ముగ్గురు - 8

  • 7.6k
  • 3.1k

అన్వర్ హూసేన్ ... హైదరాబాదీ...పి.ఓ.కే మిలిటెంట్ క్యాంప్ లో విగరస్ ట్రైనింగ్. ఆవేశం కన్నా ఆలోచన పాలు ఎక్కువ . టీం లీడర్ గా సరిహద్దు దాటుతూ బ్రతికి పోయాడు. ఇప్పుడీ మహానగరం జనసంద్రం లో కలిసి పోయారు. అతడి ఆచూకీ తెలుసుకోవటం మన డ్యూటీ. " అన్వర్ కంప్యూటర్ ఇమేజ్ చూస్తూ ఇంతియాజ్ అన్న మాటలివి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ..స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ కంబాటింగ్ మిలిటెంట్ ఎటాక్స్. " ఉన్న జిహాద్ లు చాలవన్నట్లు పులి మీద పుట్రలా ఆపరేషన్ జన్నత్ ఏమిటి సార్ ?" అతడి అసిస్టెంట్ విహారి గొంతులో చిరాకు. మా భాషలో జన్నత్ అంటే స్వర్గం. స్వర్గానికి జిహాద్ కు ఏమిటి కనెక్షన్. " విహారి ని చూశాడు. " అదే సార్ ! నా ప్రశ్న కూడా . ఏమిటి కనెక్షన్ ? " అర్థం కాక బుర్ర గోక్కున్నాడు.