సోమయ్య మావ

  • 12.1k
  • 3.8k

మా వూరి మొదట్లో బస్సు ఆగింది. అందరం బస్సు దిగాం. నేను, కవిత, పిల్లలు- అవినాష్, శిరీష.. అక్కడి నుండి కుడి వైపు అరకిలో మీటరు. ఊరి బాట వెంబడి నడిస్తే మా ఊరు వస్తుంది. మా చిన్నప్పుడు బాటకు రెండు వైపులా పచ్చగా పొలాలు ఉండేవి. బాట వెంబడి నడుస్తుంటే పచ్చటి వరిమొలకల వైపు నుండి వీచే ప్రాణ వాయువు చల్లగా సేద తీర్చేది. ఇప్పుడు ఊరు పెరిగింది. పచ్చదనం మాయమైంది.ఎదురు పడ్డ ప్రతి వారూ ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆ స్నేహం లో, ఆత్మీయత లో కమ్మదనం మా నలుగురి నీ ప్రేమ తో కట్టి పడేసింది. అమ్మ పలకరింపు లో ఆత్మీయత, మామయ్య చూపుల్లో ఆదరణ నన్ను పూర్తిగా 'రీ ఛార్జ్ ' చేశాయి. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నమ్మ ను చుట్టేసి వూపిరి సలుపుకోనివ్వటం లేదు . ఏడాది తర్వాత కలిసిన కూతుర్ని