ఆ ముగ్గురు - 3

  • 8.9k
  • 4k

సూర్య కిరణాలే సోకని శీతల వాతావరణం. పగటి లో సగభాగం గడిచిపోయినా చలి తీవ్రత తగ్గలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్వర్, అతడి టీం సభ్యులు. జమ్మూ ప్రాంతంలో LOC కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.పగటి సమయం కనుక అడవి జంతువుల బెడద అంతగా ఉండదు. అందుకే వారి నడకలో ధీమా,వేగం కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వారు నడుస్తున్నప్పుడు బూట్ల క్రింద నలిగే ఆకుల చిరు సవ్వడిస్పష్టంగా కనిపిస్తోంది. ఆకుల పై పేరుకున్న మంచు వారుఆకులను తగిలినప్పుడు. చెదిరి క్రిందక జారుతోంది. ప్రకృతి చీకటి ముసుగులో జోగుతున్నప్పుడే వారి ప్రయాణం మొదలైంది. అలా నడుస్తూ వారు ఓ సమయంలో ప్రదేశానికి వచ్చారు.అక్కడో మిలిటరీ పోస్ట్ ఉంది. రెండు చిన్న గ్రామాలకు వేదిక అది. అబుల్ సలాం పేరు చెప్పగానే అవుట్ పోస్ట్ ఇన్చార్జి లో మంచి స్పందన