నా జీవిత పయనం - 6 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 15.7k
  • 6.8k

స్నేహంకోసం కాలేజీ లో జాయిన్ అయ్యి 10రోజులవుతుంది. తొమ్మిది మంది మంచి స్నేహితులయ్యారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు. సాయంత్రం బ్రేక్ లో అందరూ కాంటీన్ కి టీఫిన్ తినటానికి వెళ్తున్నారు. మరి కాలేజీ అన్నాక సీనియర్లు జూనియర్లు మధ్య గొడవలు ఉంటాయిగా. కాంటీన్ కి వెళ్తుంటే సీనియర్లు దారిలో జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తూ కనపడ్డారు. వీళ్ళకి భయం వేసి వెన్నక్కి వెళ్లిపోతున్నారు కానీ సీనియర్లు వాళ్ళని చూసి పిలిపించారు. తొమ్మిది మంది సీనియర్స్ దగ్గరికి వచ్చారు. సీనియర్స్ లో ఒక అబ్బాయి ఉన్నాడు పేరు నీరజ్ తను ప్రేమ ని చూడగానే ఇష్టపడతాడు. తనని దగ్గరకి పిలిచి తన గురించి చెప్పమన్నాడు చెప్పింది. పాట పడమన్నాడు నాకు రాదు సర్ అని అనింది నీరజ్ పరవాలేదు అని అనేలోపే వేరే ఒకడు కౌషిక్ సీనియర్