మన ప్రేమ అమరం!

(16)
  • 59.9k
  • 7
  • 20.9k

1. ఎడబాటు పేరు మోసిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ; అందులో పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఓ గది. ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ కి అవతలి వైపు ఉన్న మూడు కుర్చీలలో ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. ఇవతలి వైపు ఉన్న ఒక కూర్చీలో ఓ కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అతను విశాలమైన నుదురుతో, ఆకర్షించే కళ్ళతో, ఆకట్టుకునే నవ్వుతో, చూడటానికి ఎంతో చక్కగా, హుందాగా ఉన్నాడు. ఆ ముగ్గురు ఇతనిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇతను వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని తడబడకుండా సమాధానాలిచ్చిన అతనిలోని నిజాయితీ, ఆత్మవిశ్వాసం చూసి, వాళ్ళు అతనికి ఉద్యోగమిస్తారు. అందుకు అతను ఎంతో సంతోషంతో వారికీ థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు, "రేపటి నుండి జాబ్ లో జాయిన్ అయిపోతారుగా?" అని ఆ ముగ్గురిలో ఒకరు అతన్ని